రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్‌లో కామారెడ్డి విద్యార్థికి ఘన విజయం

రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్‌లో కామారెడ్డి విద్యార్థికి ఘన విజయం

ఇంటర్ స్టేట్ ఒలింపియాడ్స్‌లో లిటిల్ స్కాలర్ స్కూల్ ఏడో తరగతి విద్యార్థి పాముల కౌండిన్యకు మూడో ర్యాంకు 

రాష్ట్రవ్యాప్తంగా 26వ స్థానం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 24

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా నిర్వహించిన 12వ అభ్యాస మహోత్సవంలో భాగంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ స్మారకార్థం నిర్వహించిన రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్ – ఇంటర్ స్టేట్ ఒలింపియాడ్స్ 2025–26లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ స్కూల్ విద్యార్థి పాముల కౌండిన్య అద్భుత ప్రతిభను చాటాడు.

ఏడో తరగతి చదువుతున్న పాముల కౌండిన్య గణిత శాస్త్ర పరీక్షల్లో స్కూల్ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడంతో పాటు, మరియు మొత్తం రాష్ట్ర స్థాయిలో 26వ ర్యాంకు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు.

ఈ ఘన విజయంపై విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా, లిటిల్ స్కాలర్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు కౌండిన్యను అభినందిస్తూ అతని భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. గణితంలో ఇలాంటి ప్రతిభావంతులు జిల్లా నుంచి వెలుగులోకి రావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment