కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పి బాధ్యతల స్వీకరణ
ప్రశ్న ఆయుధం,కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 1:
కామారెడ్డి సబ్ డివిజన్ ఏ ఎస్పీగా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డివిజన్లోని సిఐలు, ఎస్ఐలతో ఆమె సమావేశమయ్యారు. పెండింగ్ కేసుల వివరాలు, పోలీస్ అధికారుల పనితీరు, కొత్త ఏడాదిలో చేయాల్సిన పనుల గురించి చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.