కామారెడ్డి పట్టణ బీజేపీ మహిళా మోర్చా కొత్త కార్యవర్గం ప్రకటింపు

కామారెడ్డి పట్టణ బీజేపీ మహిళా మోర్చా కొత్త కార్యవర్గం ప్రకటింపు

పార్టీ బలపాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చిన నేతలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

( ప్రశ్న ఆయుధం)అక్టోబర్ 28

 

బీజేపీ కార్యాలయంలో శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు, కామారెడ్డి పట్టణ బీజేపీ మహిళా మోర్చా నూతన కార్యవర్గాన్ని పట్టణ అధ్యక్షురాలు కంది బాలమణి మంగళవారం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా ఎం. లక్ష్మీ, పి. కౌసల్య, బి. వరలక్ష్మి, ఎస్. రేణుక, కె. అనసూయ, ప్రధాన కార్యదర్శులుగా యూ. అక్షయ, ఎ. రజిత, కార్యదర్శులుగా జి. రత్నం, కె. ప్రమీల, బి. లావణ్య, హేమలత, క్యాషియర్‌గా జి. జ్యోతి నియమితులయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా సరిత, రత్నం, సురేఖ, ఎం. రాణి, అరుణ, లింబవ్వ, బి. సిద్ధవ్వ, నందిని, అనిత, సుశీల, వనిత నియమితులయ్యారు.

తరువాత కొత్త కార్యవర్గ సభ్యులను పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ శాలువాలతో సన్మానించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ బీజేపీ పటిష్టతకు అందరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment