కామారెడ్డి పట్టణ బీజేపీ ST మోర్చా కొత్త కార్యవర్గం ప్రకటింపు
పార్టీ బలపాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చిన నేతలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 28
బీజేపీ కార్యాలయంలో శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు, కామారెడ్డి పట్టణ బీజేపీ ST మోర్చా నూతన కార్యవర్గాన్ని పట్టణ అధ్యక్షుడు వినోద్ మంగళవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా కె. రాములు, కె. ప్రవీణ్, కె. ప్రశాంత్, రాథోడ్ అనిల్, బి. నవీన్, ప్రధాన కార్యదర్శిగా కె. నవీన్, కార్యదర్శులుగా బి. రవి, బి. సంజు, కె. ఆనంద్, కె. రవీందర్, క్యాషియర్‌గా కె. గంగాధర్ నియమితులయ్యారు.
తరువాత కొత్త కార్యవర్గ సభ్యులను పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ శాలువాలతో సన్మానించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తూ బీజేపీని పటిష్టంగా నిలబెట్టేందుకు అందరం కలిసి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.