బీసీల రిజర్వేషన్లను పక్కదారి పట్టించి, ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ మాట తప్పింది
మైనార్టీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్ ను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలనుకుంటుంది
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 6 ప్రశ్న ఆయుధం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించి, ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తోందే తప్ప బీసీల కోసం కానే కాదని, కామారెడ్డిబీసీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ మాట తప్పిందని . మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్ ను అమలు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఇల్లందకుంట మండలం లక్ష్మాజీ పల్లి గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా అసలైన ఉద్దేశ్యం బీసీల హక్కుల పరిరక్షణ కాదని. ముస్లిం రిజర్వేషన్ల కోసమేన్నారు
బీసీల హక్కుల కంటే ముస్లింల ప్రయోజనాలు రిజర్వేషన్ల అమలును కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం కపట ప్రేమను ప్రదర్శిస్తుందన్నారు. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఇప్పుడు బీసీ బిల్లు పేరిట అందులో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తుందని తెలిపారు. అసలు 42 శాతంలో బీసీలకు అందేది కేవలం 32 శాతం మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ తామే ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మాట తప్పిందని, కేవలం మైనార్టీ ఓట్ల కోసం బీసీలను ఘోరంగా మోసం చేస్తుందని మండిపడ్డారు. బీసీ సమాజం కాంగ్రెస్ చేసిన మోసాన్ని గ్రహించిందని , అందుకే ఈ ధర్నాకు బీసీల మద్దతు లభించడం లేదని కృష్ణారెడ్డి పేర్కొన్నారు కామారెడ్డి డిక్లరేషన్ ముమ్ముటికీ ముస్లిం డిక్లరేషన్ గా మారిందని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బిజెపి తప్పకుండా మద్దతిస్తుందని అసలు కాంగ్రెస్ పార్టీకి బీసీల గురించి ఏనాడూ ఆలోచన చేయలేదని , కేవలం బీసీల ను రాజకీయ అవసరాలకు వాడుకుంటుందన్నారు
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా బీసీని ప్రధాని చేశారా?
ఉమ్మడి ఏపీ, తెలంగాణాలో 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా? అని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర కేబినెట్ లో, నామినేటెడ్ పదవులను ఎంతమంది బీసీలకు ఇచ్చారో చర్చిద్దామా? లోక్ సభ సభ్యుల్లో ఎంతమంది బీసీలకు సీట్లిచ్చారో కాంగ్రెస్ సమాధానమివ్వాలనీ బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు.బీసీలకు హక్కుల గురించి బిజెపికి నీతులు చెప్పాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీసీ రిజర్వేషన్ల అంశంతో కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుండి కాంగ్రెస్ తప్పుకోవాలని ప్రయత్నం చేస్తుందన్నారు కాంగ్రెస్ కుటిల రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యేయని, అందుకే యూపీ, బెంగాల్, బీహార్ లో కనుమరుగైందని , త్వరలో తెలంగాణలోనూ కాంగ్రెస్ కు కనుమరుగవడం తథ్యమన్నారు దేశానికి తొలి బీసీ ప్రధానిని చేసిన ఘనత బీజేపీదేనని, ఇప్పటివరకు 27 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా, అనేక రాష్ట్రాల్లో బీసీ సీఎంలుగా నియమించిన ఘనత కూడా బీజేపీదేనని, అదే కాక, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని సాధించిపెట్టిందన్నారు. కాంగ్రెస్
కేంద్రంపై బురద చల్లడానికి పనికిమాలిన రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు ప్రధానంగాతెలంగాణలో హిందువులను మైనారిటీలుగా మార్చడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తుందని పక్కా పథకంతో తెలంగాణలో మెజారిటీ హిందువులను మైనారిటీలుగా మార్చాలన్న కుట్రకు కాంగ్రెస్ పథకాన్ని రూపొందించిందన్నారు.100 శాతం ముస్లింలకు రిజర్వేషన్లను అమలు చేసి, హిందువులను వెనుకబెట్టాలన్నది కాంగ్రెస్ దురుద్దేశం స్పష్టంగా అర్థమవుతుందని ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. దుష్ట కాంగ్రెస్‌కి తగిన బుద్ది త్వరలోనే వస్తుందని , బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై మోపి తప్పించుకునే ప్రయత్నాన్ని బీసీ సామాజిక వర్గాలు ఒప్పుకునే పరిస్థితిలో లేవన్నారు.ఈ కార్యక్రమం లో ఇల్లందకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, కమలాపూర్ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, తుమ్మ శోభన్ బాబు, ఆరెల్లి శ్రీనివాస్, అంతం ఎల్లారెడ్డి, రత్నాకర్, రాంబాబు, లింగారెడ్డి,తడిగోప్పుల రమేష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు