కామారెడ్డి రక్తదాతల సమూహానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

కామారెడ్డి రక్తదాతల సమూహానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

దేశంలోనే అత్యధిక యూనిట్లను తలసేమియా చిన్నారులకు అందజేసిన సంస్థగా గుర్తింపు

-2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి తెలంగాణకే గర్వకారణం

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) లకు భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందని కామారెడ్డి సమూహ వ్యవస్థాపక, అధ్యక్షులు డాక్టర్ బాలు తెలిపారు. సంవత్సర కాలంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 22 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకుగాను ఈ ఘనతను సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి సమూహ వ్యవస్థాపక, అధ్యక్షులు డాక్టర్ బాలు, డాక్టర్ వేద ప్రకాష్ లు మాట్లాడుతూ తల సేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, దేశంలోనే సంవత్సరకాలంలో 2306 యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం ఒక సంవత్సర కాలంలో అందజేసిన ఘనతను సాధించిన మొట్టమొదటి సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు దక్కిందని, ఇప్పటివరకు 4 యూనిట్లకు పైగా రక్తాన్ని చిన్నారుల కోసం అందజేయడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి చిన్నారుల ప్రాణాలను కాపాడుతామన్నారు. ఈ విజయానికి సహకరించిన రక్తదాతలకు, కళాశాలల యాజమాన్యాలకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలు, డాక్టర్ వేదప్రకాష్, జమీల్, గంప ప్రసాద్, పుట్ల అనిల్ కుమార్, ఎర్రం చంద్రశేఖర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment