కేసులలో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేసి త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చూడాలి..

కేసులలో
Headlines 
  • కేసులలో వేగవంతమైన విచారణ, సైబర్ క్రైమ్ బాధితులకు రీఫండ్ కోసం ప్రత్యేక చర్యలు
  • కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పటిష్ఠతపై జిల్లా ఎస్పీ సూచనలు
  • రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి – ప్రధాన మార్గాలలో సైన్ బోర్డుల ఏర్పాట
 

సైబర్ క్రైమ్ ద్వారా బాదితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యే విధంగా చూడాలి

-పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:

తరచూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పై రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి పట్ల నిఘా ఉంచాలి.నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సింధుశర్మ ఐపిఎస్
ఈ సందర్భంగా ఎస్పీ పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరస్తులను పి టి వారెంట్ ద్వారా కోర్టు లో ప్రవేశపెట్టి సైబర్ బాధితులకు భాసటగా నిలవాలని సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో వుండాలని, గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏవిధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనే విషయాలపై తగు సలహాలు మరియు సూచనలు చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి భాదితులకు అండగా నిలవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ స్పాట్ ఏరియాలుగా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించాలి. ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, వాహనదారులతో మర్యాదగా మాట్లాడుతూ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,నేర నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను చేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, స్వచ్చంధంగా వారి గ్రామలలో, ప్రధాన కూడళ్లలో, సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల ఆన్లైన్, మోసాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయములో రెండు వారాల స్టేషన్ రైటర్ శిక్షణ పూర్తి చేసుకున్న 18 మంది మహిళా అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగినది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదన ఎస్పి అడ్మిన్ కే నరసింహారెడ్డి,డి‌ఎస్‌పిలు నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ జార్జ్ , డి‌సి‌ఆర్‌బి ఇన్స్పెక్టర్ మురళి , జిల్లాలోని సీఐలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now