ఖేలో ఇండియా కు ఎంపికైనా కంభం పాలిటెక్నిక్ విద్యార్థి
కంభం ఎస్వికేపీ కళాశాల కు చెందిన సివిల్ మొదటి సంవత్సరం చదువుతున్న రామిరెడ్డి ప్రసన్న ఖేలో ఇండియా కు జంప్ రోప్ లో ఎంపికైనది. సెప్టెంబర్ నెల12 నుండి 14 వరకు నాందేడ్ లో జరిగిన నేషనల్ జంప్ రోప్ ఛాంపియన్ షిప్ లో ఆఫీషియల్ గా ఎంపిక కాగా,ఆమెను స్థానిక ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. అనంతరం ఖేలో ఇండియా కు ఎంపికైనట్లు, అక్టోబర్ లో నేపాల్ లో కూడా జరిగే ఛాంపియన్ షిప్ లో పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జే.సాయిబాబు రెడ్డి తెలిపారు.ఒలంపిక్స్ నే లక్ష్యం గా సాధన చేస్తున్నట్లు ప్రసన్న తెలిపింది.ప్రసన్న స్వగ్రామం కడప జిల్లా ముత్తుకూరు కు చెందిన రైతు రామిరెడ్డి చంద్రఓబుల్ రెడ్డి కుమార్తె.