*అనంతపురం: ‘కనకదాస జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి*’
సెయింట్ కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 18 జరిగే సెయింట్ కనకదాస జయంతి సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెయింట్ కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ఈనెల 18న జరుపుకోవాలన్నారు.