మున్నూరు కాపు సంఘ యూత్ అధ్యక్షునిగా కానకుంట గోవర్ధన్
ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 23, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా మున్నూరు కాపు సంఘ భవనంలో సోమవారం ఎన్నిక నిర్వహించారు. కామారెడ్డి మండల మున్నూరు కాపు యువజన విభాగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి మండల మున్నూరుకాపు యువజన విభాగం అధ్యక్షునిగా కానకుంట గోవర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా మామిండ్ల మారుతి, ఉపాధ్యక్షులుగా పెద్ద పోతన్న గారి రాజేష్, బానాల సురేష్, కోశాధికారిగా రావుల నడిపి గంగాధర్, కార్యదర్శి లక్కాకుల లక్ష్మణ్, తోట సాయిలు, కార్యవర్గ సభ్యులుగా ముదాం మహేష్, కాసర్ల భూముడి బోదయ్య, సంగిశెట్టి నరేష్, బచ్చగారి భాస్కర్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల మున్నూరు కాపు సంఘ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.