ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డ , కంచర్ల రవి గౌడ్

*ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డ , కంచర్ల రవి గౌడ్*

సిరిసిల్ల. డిసెంబర్ 28.(ప్రశ్న ఆయుధం )

తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో తెరాస నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ, పెండింగ్ లో స్కాలర్ షిప్ లు , ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్‌ షిప్‌లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమని అని తెలిపారు.ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ల సమయంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌ల మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలన్నీ విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న ఆ ఉసు ఎత్తకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే డిగ్రీ కళాశాల యజమానులు బంద్ చేసుకోవడం జరిగింది. ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని విద్యార్థులు స్కాలర్ షిప్ ఫీజు డిపార్ట్మెంట్ రాక చాలా ఇబ్బందులు అవుతున్నారు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు విడుదల చేయాలని, లేని ఎడల విద్యార్థులకు తెరాస నాయకులు అండగా ఉంటామని అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని విద్యార్థులు ఎంతో ఆశగా చూస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా విద్యార్థుల ఊసే ఎత్తలేదని ఆవేద వ్యక్తం చేశారు.ఇప్పటికైనా పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ముద్దం అనిల్, సాయి, వినయ్,కోడం,వెంకటేశం, సమి,అక్రమ్ ,సాయి, గణేష్,విష్ణు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now