*బంగారు మైసమ్మ, నల్లపోశమ్మ ఆలయాల్లో బోనం సమర్పించిన కందాడ త్రినేత్రి*
హైదరాబాద్ 20, జూలై ( ప్రశ్న ఆయుధం): బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని మగళహాట్ ప్రాంతంలోని బంగారు మైసమ్మ మరియు నల్లపోశమ్మ ఆలయాల్లో బోనం సమర్పణ ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర సందర్భంలో కందడా నరేందర్ గౌడ్ – కందడా రేణుక గౌడ్ దంపతుల కుమార్తె కందడా త్రినేత్రి, కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, శాంతి, సౌఖ్యాలు కలగాలని వారు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మగళహాట్ స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించారు.