బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
కొత్తగూడెం: బహుజన ఉద్యమ సిద్ధాంత కర్త,రాజకీయ వ్యూహకర్త,బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యులు కాన్షీరామ్ 18వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కొత్తగూడెం క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ పాల్గొని కాన్సీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు సాధించిన బహుజన యోధుడు,బహుజన రాజ్యాధికార స్వాప్నికుడు కాన్షీరామ్ అని,బహుజన మహనీయులైన జ్యోతిరావు పూలే,ఛత్రపతి సాహుజీ మహారాజ్,శ్రీ నారాయణ గురు,పెరియార్ రామస్వామి నాయకర్,బాబా సాహెబ్ అంబేద్కర్ ల
పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని బహుజన రాజ్యాధికార సిద్ధాంతాన్ని రూపొందించి 14 ఏప్రిల్ 1984లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించారని,తద్వారా అధికారానికి దూరంగా ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలైన బహుజనులకు ఉత్తరప్రదేశ్ లో అధికారం రుచి చూపించారని,ఆత్మగౌరవం కోసం,విముక్తి కోసం,అసమానత్వం,అన్యాయం,అణగారిన వర్గాలపై దాడులకు వ్యతిరేకంగా,అంటరానితనానికి వ్యతిరేకంగా,సమాజంలో సోదర భావం నింపుతూ కుల నిర్మూలన కోసం పోరాడిన మహనీయుడు కాన్సీరామ్ అని కొనియాడారు.బహుజన మహా పురుషుల చరిత్రను వారి పోరాటాలను దేశవ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు నిర్వహించి చైతన్య పరిచారని,సామాజిక పరివర్తన కోసం పరితపించారని నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని,కాన్సీరామ్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాంపాటి నరేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి వీరు నాయక్,జిల్లా కోశాధికారి పీక మల్లికార్జునరావు,కొత్తగూడెం,ఇల్లందు,పినపాక నియోజకవర్గ అధ్యక్షులు నాగుల రవికుమార్,అజ్మీరా వెంకన్న,సత్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు