Site icon PRASHNA AYUDHAM

కరాటే క్రీడా శారీరక దారుడ్యానికి ప్రతీక…!

కరాటే
Headlines in Telugu:

క్రీడలు మానసిక వికాసానికి దోహదం చేస్తయి – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం.”

ప్రశ్న ఆయుధం నవంబర్ 03: కూకట్‌పల్లి ప్రతినిధి

” కరాటే క్రీడా శారీరక దారుఢ్యానికి ప్రతీక – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం.”

కూకట్ పల్లి లోని శ్రీ పుల్లూరి నారాయణదాస్ కల్యాణ మండపం లో జరిగిన 5వ నేషనల్ లెవల్ ఓపెన్ కరాటే & కుంగ్ ఫు & తాయిక్ వండ్ ఛాంపియన్ షిప్ 2024. ఈ కంపిటిషన్ కార్యక్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర, బెంగళూరు, ముంబాయి, తెలంగాణ లోని నాగర్ కర్నూల్, వరంగల్, పెద్ద పల్లి జిల్లాల నుండి 450 మంది విద్యార్థులు కంపిటిషన్ లో పాల్గొన్నారు. నీయుద్ధ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు టి.సంతోష్ కుమార్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ప్రతిభ కనబరించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మేడల్స్, బహుమతులు సత్యం శ్రీరంగం చేతులమీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో షీ టీం లక్ష్మి రుద్రమ దేవి సెల్ఫీఢిఫెన్స్ అకాడమీ ఫౌండర్, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, రవి, శ్రీధర్, సత్య శంకర్ తదితర మాస్టర్లు, అకాడమీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version