సంగారెడ్డి ప్రతినిధి, జూలై 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): కార్గిల్ విజయ దివోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. శుక్రవారం నాడు సంగారెడ్డిలో లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాయత్ లింగ బలిజ సంఘం ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ స్వామి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ పాటిల్ లు మాట్లాడుతూ.. భారత దేశ రక్షణ కొరకు అహర్నిశలు పోరాడుతున్న జవాన్లకు అండగా ఉండడం భారతీయులుగా మన బాధ్యత అని అన్నారు. జవాన్ల కుటుంబాలకు భారత దేశం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ధనుంజయ్, అధ్యక్షుడు పృథ్వీరాజ్, ఉపాధ్యక్షుడు అశోక్ రాజ్ పాటిల్, సంగీశేటీ, కోశాధికారి గోవురాజు, ఉపకోశాధికారి శివ, గౌలిశ్వర్ సంగమేశ్వర్, (రిటైర్డ్ పారా మిలిటరీ) విశ్వశ్వర్ (రిటైర్డ్ ఆర్మీ) సందీప్, సూర్యకాంత్, జరనప్ప యువ నాయకులు పాల్గొన్నారు.