-పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల
పాత పాల్వంచ గడియకట్టలోని మైసమ్మతల్లి దేవాలయం ప్రాంగణంలో జరుపనున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు నిర్మించనున్న మండప నిర్మాణ పనులకు డీసీఎంస్చై ర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు కర్రపూజ చేసి, పనులను ప్రారంభించారు. మైసమ్మతల్లి దేవాలయం పూజారి సుమన్ శాస్త్రి ఆధ్వర్యంలో మైసమ్మతల్లికి, గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఆదిదేవుడైన గణపతిని భక్తిశ్రద్దలతో పూజిస్తే, అంతా శుభం జరుగుతుందన్నారు. గణపతిని స్మరిస్తేనే సర్వవిఘ్నలు తొలగుతాయని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వంగా రమేష్, మసనం శరత్, కోసూరు కిరణ్, కందుకూరి రాము, తేజ (ఫ్లెక్సీ), సీతమ్మ, మాచవరపు లక్ష్మి, మసనం అపర్ణ, గోసు కృష్ణవేణి, A రాజ్యలక్ష్మి*, తదితరులు పాల్గొన్నారు.