నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన సాధారణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా పంచాయితీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం జిల్లా పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, హౌసింగ్ పీడీ చలపతిరావుతో కలిసి కాశీపూర్, కంది రైతు వేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, నామినేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావలసిన ధృవ పత్రాలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించి వచ్చిన నామినేషన్ల దరఖాస్తు వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment