సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): కమ్మ సంఘం ఆధ్వర్యంలో 28వ కార్తీక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని మియాపూర్ నరేన్ గార్డెన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీ.ఏ.సీ. చైర్మన్ అరెకపూడి గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యా, సామాజిక రంగాలలో విశేష కృషి చేస్తున్న సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నిజాంపూర్ (కె) పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా.పొట్రు రామకృష్ణను కమ్మ సంఘం తరుపున ఘనంగా సత్కరించారు.
ఉపాధ్యాయుడు రామకృష్ణకు సత్కారం
Updated On: November 26, 2024 1:45 pm