సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో నవంబర్ 12న కార్తీక మాస వనభోజనాలు..

కార్తీక మాస

సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో నవంబర్ 12న కార్తీక మాస వనభోజనాలు..

-నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ

హైదరాబాద్ డెస్క్ ఖమ్మం
ప్రశ్న ఆయుధ అక్టోబర్ 22:

ఖమ్మం : కార్తీక మాసంలో వనభోజనాలు నవంబర్ 12న చేయాలని సఖీ జాతీయ మహిళా మండలి సోదరీమణులు నిర్ణయించడం జరిగినది . కార్తీకమాసం వనభోజనాలు మంచి సంస్కృతికి ఆచారాలకు సంప్రదాయాలకు నిదర్శనమని ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు . పచ్చని పంట పొలాలు , ప్రకృతి నడుమ , మంచి వాతావరణంలో, కుల , మత వర్గ ద్వేషాలు లేకుండా అన్ని కులాలు సంతోషముతో జరుపుకునే పండగే కార్తీక వనభోజనాలు . కార్తీక మాస వనభోజనాలు ప్రతి ఇంటా ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి . ప్రతి మహిళ , ప్రతి కుటుంబం , సమాజంలోని విభిన్న కుల మతాలు కలిసి ఒక్కటిగా ఒక సమూహముగా జరుపుకునే అద్భుతమైన , ఆలాధకరమైన పండుగ కార్తీక వనభోజనాలు అని పౌండరన్ చైర్మన్ నరాలు సత్యనారాయణ అన్నారు . ఈ కార్యక్రమంలో నేషనల్ కో చైర్ పర్సన్ అనికా గౌరి , నేషనల్ ట్రెజరర్ రాయల సంద్య , నేషనల్ కోఆర్డినేటర్ దిరిశాల ఉమా , నేషనల్ కో కన్వీనర్స్ షేక్ సోనీ , గంగుల శ్రీదేవి , నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రణబోతు ఉమ , నేషనల్ జాయింట్ సెక్రటరీ ఊటుకూరు సింధు , నేషనల్ కమిటీ మెంబర్స్ రాజ్యలక్ష్మి, కల్వకుంట్ల శాంతి , సుబ్బకోటి రేణుక , నేషనల్ సెక్రటరీ సిహెచ్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now