స్వయంభు శ్రీ సంతాన నాగ శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు

స్వయంభు శ్రీ సంతాన నాగ శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు

*పుట్టలో పాలు పోసి మోక్కలు చెల్లించుకున్న భక్తులు*

*అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టిన ఆలయ కమిటీ సభ్యులు*

*జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 25 ప్రశ్న ఆయుధం*

ప్రకృతిని ఆరాధించడం పాములను పూజించడం అనే సంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుండి అనుసరిస్తున్నారు కార్తీకమాసంలో కార్తీక శుద్ధ చతుర్థి రోజున నాగుల చవితి పండుగను హిందువులు జరుపుకుంటారు ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో స్వయంభు శ్రీ సంతాన నాగ శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి పురస్కరించుకొని భక్తుల ఆరాధ్య దైవం నాగదేవతలకు మహిళలు స్థానిక ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి అభిషేకాలు నిర్వహించి పూలుపండ్లతో ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎరబాటి కృష్ణ. మటికే రమేష్. గుండా కేదారి ఇంగిలే నాగయ్య ఎరబాటీ శ్రీను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment