వీరశైవ లింగాయత్ బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు

*వీరశైవ లింగాయత్ బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు*

 

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో కులబ్ గూర్ మంజీరా డ్యామ్ వద్ద గంగా సహిత ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక వన భోజనాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ బలిజ సంఘం సాంప్రదాయాలు పాటిస్తూ.. సమాజాన్ని ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తాయని ఆమె పేర్కొన్నారు. తంగడపల్లి మఠం పీఠాధిపతి శివచార్యులు, శివాలయం ప్రథమ పూజారులు శర్మ పాల్గొని పర్వచనలు కార్తీక వన భోజన విశిష్టత తెలియజేశారు.

పిల్లలు, యువతులు, మహిళలు సాంస్కృతిక ప్రదర్శనలతో సభను మరింత ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ వంటి అంశాలపై చర్చ జరిపారు. సంఘం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం అందరికీ వన భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సంగమేశ్ పాటిల్, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ధనుంజయ్, అధ్యక్షడు పృథ్వీరాజ్, కార్యదర్శి మల్లికార్జున పాటిల్, కోశాధికారి గోవు రాజు, శివకుమార్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ స్వామి, సంగమేశ్వర్, సతీష్ పాటిల్, ప్రభు, న్యాయవాదులు సంగమేష్ పాటిల్, శివ కుమార్ పాటిల్, మహిళ విభాగం సభ్యులు విరమనీ, వినిత, కార్యవర్గ సభ్యులు, వీర శైవ లింగాయత్ లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment