కలెక్టరేట్ లో కార్తీక వన భోజనాలు

*కలెక్టరేట్ లో కార్తీక వన భోజనాలు*

ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్, అదనపు కలెక్టర్*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి కలెక్టర్ లోని ఫ్రీడమ్ పార్కులో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కార్తీక వన భోజనం కార్యక్రమం నిర్వహించారు. డిఆర్డిఏ పిడి జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజనాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్ లు ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఉద్యోగులతో కలిసి కార్తీక వన భోజనాలలో కలెక్టర్, అదనపు కలెక్టర్ పాల్గొని భోజనం చేశారు. ఉద్యోగులలో స్నేహభావం పెంపొందడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ క్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment