అత్యంత వైభవంగా నిర్వహించిన కార్తీక వన సమారాధన 

అత్యంత వైభవంగా నిర్వహించిన కార్తీక వన సమారాధన

ప్రశ్న ఆయుధం నవంబర్ 17: శేరిలింగంపల్లి ప్రతినిధి 

చందానగర్, ఇస్నాపూర్ సంఘాల కలయికతో పటాన్చెరులోని పోలీస్ స్టేషన్ పక్కన గల మైత్రి గ్రౌండ్ లో శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం 34వ కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సమారాధనకు మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం , శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు బంధుమిత్రులందరూ సుమారు 5000 మంది పాల్గొని అత్యంత వైభవంగా కార్తీక సమారాధన మహోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ మహోత్సవానికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ హాజరై జ్యోతిని వెలిగించి వనభోజన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ, తెలంగాణలో నివసిస్తున్న కాపు తెలగా బలిజ ఒంటరి మున్నూరు కాపులు అందరూ కలిసికట్టుగా ఉండి అందరి అభివృద్ధికి ఒకరినొకరు తోడ్పాటుగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ. వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షురాలు. గోదావరి అంజి రెడ్డి , అంజి రెడ్డి, నందీశ్వర్ గౌడ్, డాక్టర్. పుంజాల అలేఖ్య, చైర్మన్. తెలంగాణ సంగీత నాటక అకాడమీ పర్సా పరమేశ్వరరావు, తెలంగాణ మున్నూరు కాపు అధ్యక్షులు కొండ దేవయ్య ,డాక్టర్. పుంజాల వినయ్ , శంభుపూర్ కృష్ణ, కార్పొరేటర్ కుత్బుల్లాపూర్ నల్ల అజయ్, నల్ల విష్ణు , నల్ల పవన్ , నర్రా బిక్షపతి, గాలి అనిల్ కుమార్ , సినీ ఆర్టిస్టులు కలగొల్ల రామానాయుడు, చరణ్ రాజు, శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్షులు విష్ణుమూర్తి, అప్పారావు , సూర్యచంద్రరావు, పూల కిషోర్ , త్రినాధ రావు , పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఈ సమారాధన జరగటం హర్షదాయకం వచ్చిన పెద్దలందరూ అందరినీ ఉద్దేశించి అందరూ కలిసికట్టుగా ఉండాలని సందేశాన్నిచ్చారు.

Join WhatsApp

Join Now