టీజీఎస్ ఆర్టీసీ డిపోలో కార్తీకమాస వనభోజన కార్యక్రమం
టిజిఎస్ ఆర్టీసీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో కార్తీకమాస వనభోజనాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.వన భోజనాల కార్యక్రమాన్ని గాజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పావన్ ప్రారంభించారు.వారు మాట్లాడుతూ టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ సజ్జనార్ ఆదేశానుసారం కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నట్లు వివరించారు.
ఇట్టి కార్యక్రమంలో భాగంగా డిపోలో వివిధ సంస్కృతిక కార్యక్రమలు,ఆటల పోటీలు నిర్వహించి వారికీ బహుమతులు ప్రదానం నిర్వహించడం జరిగిందని అన్నారు.అనంతరం డ్రైవర్,కండక్టర్,డిపో సిబ్బంది అందరు తమ తమ డ్యూటీలతో ఉండే అందరికి ఇలాంటి మానసిక ఉల్లాసం కలిగించే వనభోజనం లాంటి కార్యక్రమాలు ఎంతగాను దోహద పడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ బాబు నాయక్,మాఫ్ జమీల్,డిపో సూపరిండెంట్ పాల్,డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.