Site icon PRASHNA AYUDHAM

ఏపీ పీసీసీ అధికార ప్రతినిధిగా కాసరగడ్డ నాగార్జున.

ఏపీ పీసీసీ అధికార ప్రతినిధిగా కాసరగడ్డ నాగార్జున.

షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం: కాసరగడ్డ నాగార్జున.

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధికార ప్రతినిధిగా కాసరగడ్డ నాగార్జున నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధికార ప్రకటన విడుదల చేశారు. కాసరగడ్డ నాగార్జున సహా 9 మందిని అధికార ప్రతినిధులుగా నియమిస్తూ జాబితాను విడుదల చేశారు. అంకితభావంతో పనిచేస్తా: కాసరగడ్డ నాగార్జున తనపై అత్యంత నమ్మకంతో కీలకమైన పీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాసరగడ్డ నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను తాను చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. నిరంతరం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానని వివరించారు. తనకు పదవి రావడంలో సహకరించిన ప్రతిఒక్కరికి నాగార్జున పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version