సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాట సుధా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భక్తుల నమ్మకంతో ఆలయ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని, ప్రజలంతా శాంతి, సంపదలతో అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న కాట సుధా శ్రీనివాస్ గౌడ్
Published On: March 24, 2025 6:30 pm
