సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం, శేర్కాన్ పల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ పలుగు మీది పోచమ్మ దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు.
పలుగుమీది పోచమ్మను దర్శించుకున్న కాట సుధా శ్రీనివాస్ గౌడ్
Oplus_131072