కత్తి కార్తీక సేవలు అభినందనీయం
– కత్తి కార్తీకకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలు సంఘాల నాయకులు
దుబ్బాక ,జనవరి04
దుబ్బాక నియోజకవర్గంలోని పేదప్రజలకు తన స్వంత ఖర్చులతో కత్తి కార్తీకగౌడ్ చేస్తున్న సేవలు అభినందనీయమని టిసిఎఫ్ జిల్లా అధ్యక్షులు కుంభాల రవీందర్, ఎమ్మార్పీఎస్ జాతీయవర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ , అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాల్వ లింగం, ఐజెయు జాతీయ కౌన్సిల్ మెంబర్ యాడవరం భాస్కర్ గౌడ్, మానవ హక్కుల సంఘం మెంబర్ అహోబిలం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం దుబ్బాక పట్టణంలో కత్తి కార్తీక పౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవ స్థాపక అధ్యక్షురాలు కత్తి కార్తీక గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సంధర్బంగా కత్తి కార్తీక గౌడ్ ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్బంగా గర్భిణీ స్త్రీలకు మహాలక్ష్మి కానుక, తొలుసూరు ఆడ బిడ్డకు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లతో పాటు ఆర్థిక సహాయ సహకారాలు అందించడంలో కత్తి కార్తీక విశేష జనాదరణ పొందుతుందని అన్నారు. భవిష్య త్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, సచిన్, కర్ణాకర్ శ్రీనివాస్, నవీన్ రాజు, బాలరాజ్, సుధాకర్, శేఖర్, ప్రసాద్, మహేందర్, తెలంగాణ కన్జ్యూమర్ ఫోరం జిల్లా కార్యదర్శి మూర్తి నరేష్ రెడ్డి, సెక్రటరీ భాస్కర్ రెడ్డి, ఎగ్జిక్యూ టివ్ మెంబర్ బండమీది మల్లయ్య దుబ్బాక పరశురాము లు, గుర్రాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.