వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కత్తి కార్తిక గౌడ్

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కత్తి కార్తిక గౌడ్

దుబ్బాక , జనవరి10

వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కత్తి కార్తీక కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బాలేశం గౌడ్, సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, కొత్త దేవి రెడ్డి, మల్లాయిపల్లి మాజీ ఉప సర్పంచ్ రాములు,కామోజీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment