నాగారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో స్థానికుల హక్కు కోసం పోరాటం కొనసాగిస్తాం: కౌకుంట్ల చంద్రారెడ్డి

**నాగారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో స్థానికుల హక్కు కోసం పోరాటం కొనసాగిస్తాం: కౌకుంట్ల చంద్రారెడ్డి**

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 11

నాగారం మున్సిపల్ పరిధిలో నిర్మించిన 6,200కి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో, స్థానిక అర్హులకు కనీసం 10 శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తూ గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకురావడంలో తమ న్యాయపోరాటం విజయవంతమైందని మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రారెడ్డి, “నాగారం పరిధిలోని నిరుపేద కుటుంబాలకు ఈ ఇళ్లు అందే వరకు మా పోరాటం ఆగదు. అవసరమైతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. న్యాయపోరాటానికి కూడా మేము సిద్ధం,” అని స్పష్టం చేశారు.

ప్రజా హక్కుల కోసం తాము పోరాటం చేస్తామన్న నిశ్చయంతో ఉన్నామని, ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు స్థానిక నిరుపేదల చేతికి చేరేవరకు నిరాహార దీక్షలకైనా వెనుకంజ వేయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డితో పాటు బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, వీరేష్ గౌడ్, కృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment