దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కౌమారి పూజలు
ప్రశ్నాయుధం న్యూస్ , అక్టోబర్ 05, కామారెడ్డి ;
కామారెడ్డి పట్టణం దేవునిపల్లి స్వప్నలోక్ కాలనీలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వప్నలోక్ కాలనీ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కౌమారి పూజలు నిర్వహించారు. రెండు నుండి పది సంవత్సరాల బాలికలకు అమ్మవారి ప్రతిరూపంగా భావన చేస్తూ అమ్మవారి తొమ్మిది రూపాలలో శాస్త్రోత్తంగా కౌమారి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికలు, మహిళలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.