బిబిపేటలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
— బీబీ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
కామారెడ్డి జిల్లా బిబిపేట్
(ప్రశ్న ఆయుధం) జులై 26
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పై టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డి, చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల బిబిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ మరొకసారి పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడి నుండి ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ ప్రభాకర్ కు పాడి కౌశిక్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భూమా గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, సలీం,యూత్ అధ్యక్షుడు మహేష్, అరుణ్,అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, రాకేష్ రెడ్డి లతోపాటు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.