*కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు చీర, పూలు, గాజులు పెట్టి గాడిదపై ఊరేగింపు*
* కౌశిక్ రెడ్డి రౌడీ రాజకీయాలు మానుకోవాలి.
హుజురాబాద్ జనవరి 17
కరీంనగర్ జిల్లా
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలను విమర్శించడానికి నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు పూలు, గాజులు పెట్టి గాడిదపై ఊరేగించి అంబేద్కర్ చౌరస్తా వద్ద కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ని మంత్రులను దూషించడం మానుకోవాలని తన నోటి దురుసుతో సంచనల కొరకు మీడియాలో కనబడాలని తాపత్రయం మానుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి సీఎం, మంత్రుల జోలికి కౌశిక్ రెడ్డి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హుజురాబాదులో కౌశిక్ రెడ్డిని అడుగడుగున అడ్డుకొని భౌతిక దాడులకు దిగాల్సి వస్తుందని చల్లూరి రాహుల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కమిటీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ.మండల,కమిటీలు,
కాంగ్రెస్ మహిళ నాయకురాల్లు,పట్టణ శాఖ
అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.