*ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందజేస్తాం*
-కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తామని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాటిపల్లి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అధికారులందరూ కలిసి విద్యార్థులకు సమస్యలు రాకుండా చూస్తామని, పాఠశాల ఆవరణలో మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల విషయంలో సౌకర్యాల కల్పనకి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అక్షర అభ్యాస కార్యక్రమం పెట్టడం సంతోషమని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి ముందుకు రావాలి విజ్ఞప్తి చేశారు.