ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి
దమ్మపేట మండలం అంకంపాలెం ఆశ్రమ పాఠశాల ఈ ఏడాది పదవతరగతి ఫలితాలలో జిల్లాలోనే ఆశ్రమ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణతతో మండలంలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులను అధిగమించి అత్యధిక మార్కులు సంపాదించి, సంచలనాలకు వేదిక అయ్యింది.ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్దులు పోటీపడే బాసర ఐఐఐటీ కి అంకంపాలెం ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని ఇ.కావ్య సీటు సంపాదించింది. ఈ సందర్భంగా కావ్యను అంకంపాలెం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఉపాధ్యాయబృందం శాలువాతో సత్కరించి తమ ఆశీస్సులు అందించి ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం బి.శారద మాట్లాడుతూ తమ పాఠశాల నుండి ఐఐఐటీ కి ఎంపిక కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్దులు ఎప్పుడైతే తమ లక్ష్యాన్ని ముందుగానే ఎంచుకొని ముందుకు సాగుతారో వారికి తప్పకుండా విజయం లభిస్తుందని విద్యార్థులకు చదువు పట్ల మక్కువతోపాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని అలాంటి విద్యార్దులు భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు చేస్తారు. అనటంలో సందేహం లేదన్నారు. అలానే ఐఐఐటీ లో కూడా కావ్య మరింత గొప్పగా రాణించి చదువుకున్న పాఠశాలతో పాటు గ్రామానికి తల్లితండ్రులకు పేరుప్రఖ్యాతులు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నా విజయం నా తల్లితండులు అధ్యాపకులదే: కావ్య.
ఈ సన్మాన కార్యక్రమం పురస్కరించుకొని విద్యార్ధిని కావ్యా మాట్లాడుతూ తనకు ఎల్లపుడు పాఠశాల అధ్యాపక బృందం అందించిన తోడ్పాటు నా తల్లితండ్రుల ప్రోత్సాహం కారణంగానే మండలంలోనే అత్యధిక మార్కులు సాధించగలిగానని చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించి ఫీజులు భరించలేక మద్యలోనే చదువులు మానిపించేస్తున్నారని.ఇది చాలా బాధాకరమని కానీ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఎంతో నైపుణ్యం,ఉన్నత విద్యాప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులు విద్యను బోధిస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని విద్యార్దులు తల్లిత్రండుల ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించగలుగుతారని ఏ రంగంలోనైనా రాణించగలని తెలిపింది. తన విజయం తన తల్లితండ్రులకు ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నారు వివరించింది.
ఆశ్రమ పాఠశాల నుండి ఐఐఐటి కి ఎంపికైన కావ్య*
by Naddi Sai
Published On: July 26, 2025 8:51 pm