నరసన్నపేటలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
గజ్వేల్ నియోజకవర్గం, 17 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ తాజా మాజీ సర్పంచ్ మాధవి రాజిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి, వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తాజా మాజీ జెడ్పిటిసి ఏంబరి మంగమ్మ రామచంద్రం మాట్లాడుతూ కారణజన్ముడు కేసీఆర్ అని, కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం కోసం కెసిఆర్ చేసిన కృషి మరువలేనిదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.