Site icon PRASHNA AYUDHAM

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌ నాయకుడికి కేసీఆర్‌ ఆర్థికసాయం

IMG 20250303 WA0003

*ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌ నాయకుడికి కేసీఆర్‌ ఆర్థికసాయం*

ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకుడు డోకుపర్తి సుబ్బారావుకి పార్టీ అధినేత కేసీఆర్‌ ఆర్థిక సాయం అందజేశారు. కొంతకాలంగా సుబ్బారావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కేసీఆర్‌..

ఆయన్ను ఎర్రవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆయనకు ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల చెక్కును అందజేశారు.

ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఖమ్మం టౌన్‌ మాజీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయిన సుబ్బారావు.. కేసీఆర్‌కు వీరవిధేయుడిగా ఉన్నారు. సోషల్‌మీడియా వేదికగా కేసీఆర్ సందేశ్‌ పేరిట పార్టీ కార్యకలాపాలను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ను ఎర్రవల్లికి ఆహ్వానించి ఆయన వివరాలను తెలుసుకున్నారు. ఆర్థిక సాయం అందజేశారు. కాగా, ఆపదలో ఉన్న తనను ఆదుకున్న పార్టీ అధినేత కేసీఆర్‌కు సుబ్బారావు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version