ప్రాణాల్ని లెక్క చేయక తెలంగాణ సాధించి పెట్టిన ధీరుడు కేసీఆర్!!.

*ప్రాణాల్ని లెక్క చేయక తెలంగాణ సాధించి పెట్టిన ధీరుడు కేసీఆర్!!.*

 దీక్షా దివస్ వేడుకల్లో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్.*

*తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమయ్యేలా పోరాడిన గొప్ప యోధుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ గుర్తు చేశారు. దీక్షా దివస్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్ , జడ్పీ మాజీ అధ్యక్షురాలు మంజుశ్రీ జైపాల్ రెడ్డి , జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు , మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , సింధు ఆదర్శ్ రెడ్డి , బల్ రెడ్డి , సోమి రెడ్డి , మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ , బుచ్చి రెడ్డి సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి మాదిరి ప్రిథ్వీ రాజ్ తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు. తెలంగాణ ప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వరాష్ట్ర కలను కేసీఆర్ సాకారం చేసే క్రమంలో చోటు చేసుకున్న కీలక ఘట్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment