కేసీఆర్, కాంగ్రెస్… దొందు..దొందే

దొందు..దొందే

కేసీఆర్, కాంగ్రెస్… దొందు..దొందే…

ఇందూర్ లో డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చేది ఎప్పుడు?

ఇందిరమ్మ ఇండ్ల సంగతి దేవుడెరుగు.

కట్టిన ఇండ్లన్న పేదలకు ఇవ్వండి.

ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ.

 

అబద్దపు డోకా మాటలు చెప్పడంలో కెసిఆర్, మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ ప్రభు త్వం దొందు.. దొందేనని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు అమలు కానీ హామీలు ఇచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి అధికా రం లోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరి మా య మాటలు, కళ్ళబోల్లి కబుర్లు చెప్పి కాలం గడు పుతాం అంటే సహించేది లేదని హెచ్చరించారు. అర్హు లైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మంగ ళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని 10 ఏళ్ళు యావత్ తెలంగాణ ప్రజలని మోసం చేసి ఒక్క ఇల్లు కూడ పేదో నికి ఇవ్వని ఘనత బిఆ ర్ఎస్ పార్టీ కెసిఆర్కే దక్కు తుందన్నారు. అలాంటి పాలన వొద్దని తెలంగాణ ప్రజలు మార్పు కావాలని కాంగ్రెస్ 6 గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, వందల హామీ లను చూసి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే.. 100 రోజుల్లో అమలు చేస్తానన్నా హామీలు 10 నెలలు గడు స్తున్న ఇచ్చిన గ్యారంటీలకు దిక్కు లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోయినోడు డబుల్ బెడ్ రూమ్ అని మోసం చేస్తే వీడు ఇందిరమ్మ ఇండ్లు అంటు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండని మండిపడ్డారు.నిజామాబాదు అర్బన్ లో కట్టిన ఇల్లు శిథి లావస్థకు చేరుకున్నాయని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినాయని ఇంది రమ్మ ఇండ్లు దేవుడు ఎరుగు కనీసం కట్టిన ఇళ్ళైన బాగు చేసి అర్హులైన వారికీ ఇవ్వా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని పక్షాన అర్హులైన వారందరితో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేప డతాం అని హెచ్చరించారు.

పొంగులేటి మాటలు పాల మీద పొంగులాగే ఉన్నాయని ఏద్దేవా చేసారు. నిజాంబాద్ పర్యటనకు వచ్చిన పొంగు లేటి కొద్ది దసరా లోపు ఇంది రమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ఇప్పుడు నెల ఆఖారికి 3500 నుండి 4 వేలు ఇస్తాము అంటున్నారని, వచ్చే నెల డిసెంబర్ 9 సోని యామ్మ జన్మదినానికి అంటారేమో అని ఏద్దేవా చేసారు. కాంగ్రెస్ నాయకులు సోనియామ్మ జన్మదినం, జన్మదినం అని తెలంగాణకు పెద్ద బలి దినంగా మార్చేలా ఉన్నారని అన్నారు. రేవంత్ ఆనాడే చెప్పిండు సోనియా మ్మ తెలంగాణ బలి దేవత అని అన్నారు. తెలంగాణాలో రైతన్నలు తలలు పట్టుకునే పరిస్థితి ఉందని, రైతన్నలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అని, రైతు భరోసా గ్యారంటీ కింద రైతులకు, రైతు కూలీలకు 15వేలు, 12 వేలు అని పంట బోనస్ అని అన్ని బోగస్ మా టలు చెప్పి ఇప్పటికి వాటి ఊసే లేదని అన్నారు.వాన కాలం పంట వేసిన రైతన్నలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తా రని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మంత్రు లు మాట్లాడితే గత ప్రభు త్వం అప్పుల కుప్ప చేసింది చిప్ప చేతికి ఇచ్చింది అంటు న్నారని మరి ఈ విషయం ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు సోయి లేదా, అమ లు కానీ హామీలు ఇచ్చి యావత్ తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేసారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ కు నిజామాబాదు కాంగ్రెస్ నాయకులకు నామి నేటెడ్ పదవులు ఇవ్వడం పై ఉన్న శ్రద్ద జిల్లా అభివృద్ధిపై లేదని ఏద్దేవా చేసారు. నగ రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ మరమత్తుకు వెంటనే నిధులు కేటాయిం చాలన్నారు అర్హులైన వారి జాబితా ప్రజాక్షేత్రంలో ఎంపిక చేసి వారికీ ఇళ్లను ఇవ్వాలి. ఈ నెల ఆఖరులో మీరు ఇస్తానంటున్నా 4 వేల ఇంది రమ్మ ఇళ్లకు కూడా నిధులు వెంటనే విడుదల చేయాల న్నారు. అభ్యర్థుల ఎంపిక కమిటీలో మి కాంగ్రెస్ నాయ కులను పెట్టుకొని మి కార్యక ర్తలకు ఇస్తాము అంటే మేము ఊరుకోము నిజమైన అర్హు లైన పేదలకు ఇల్లు అందిం చాలని డిమాండ్ చేసారు. రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న ఎకరా నికి 15 వేలు, రైతులకు, రైతు కూలీలకు 15 వేలు, 12 వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు.రైతు రుణమాఫీ కూడా తూ తూ మంత్రాంగా చేసి గొప్పలు కొడుతున్నారని ఇంకా రుణమాఫీ కానీ రైత న్నలు ఎదురు చూస్తున్నారు మీరు చేస్తానన్నా 2 లక్షల రుణమాఫీ హామీ నెరవే ర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం అని కెసిఆర్ కి పట్టిన గతే నీకు పడు తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

1 thought on “కేసీఆర్, కాంగ్రెస్… దొందు..దొందే”

Comments are closed.