Site icon PRASHNA AYUDHAM

కేసీఆర్‌ సారూ మమ్మల్ని రక్షించండి..

.. అధికారుల కూల్చివేతల్లో ఉపాధి కోల్పోయిన తల్లీకొడుకు వేడుకోలు!మల్లాపూర్‌లో ఫుట్‌పాత్‌పై చెప్పుల దుకాణాన్ని తొలగించిన మున్సిపల్‌ అధికారులు కాంగ్రెస్‌ సర్కార్‌లో పేదోళ్లు గూడుతో పాటు ఉపాధి కూడా కోల్పోతున్నారు.సోమవారం కాప్రా మున్సిపల్‌ పరిధిలో మల్లాపూర్‌ డివిజన్‌ ఎలిఫెంట్‌ చౌరస్తా నుంచి శివ హోటల్‌ చౌరస్తా వరకు అక్రమ నిర్మాణాలను, షెడ్డులను మున్సిపల్‌ అధికారులు కూల్చేశారు. మల్లాపూర్‌ నోమా ఫంక్షన్‌హాల్‌ ఎదుట ఓ తల్లీకొడుకు చెప్పుల దుకాణాన్ని కూల్చవద్దంటూ అధికారుల కాళ్లావేళ్లాపడ్డారు. తనుకు షుగర్‌, బీపీ ఉన్నదని ఇల్లు గడవడమే కష్టంగా ఉందని, దుకాణాన్ని కూల్చితే బతకలేనని ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. కానీ అధికారులు చలించలేదు. ‘రెండు చేతులతో దండం పెడుతూ కేసీఆర్‌ సారూ ఎక్కడున్నావు. ఈ అన్యాయాన్ని చూడు. మమ్మల్మి మీరే కాపాడాలి. రేవంత్‌ మా బతుకును నాశనం చేస్తున్నాడు’ అంటూ తల్లీకొడుకులు విజప్తి చేశారు. జోనల్‌ కమిషనర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ ఆదేశాలతో అక్రమణలను తొలగించినట్టు మున్సిపల్‌ సిబ్బంది తెలిపారు.

Exit mobile version