ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జూలై22
బడ్జెట్ రోజున అసెంబ్లీకి కేసీఆర్..!బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే తేదీ ఖరారైంది. బడ్జెట్ రోజున మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.