ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

*విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి*
*ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి*
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ తులసీదాస్*

*జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 8*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పాతర్లపల్లి సిరిసెడు గ్రామాలలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ మెడికల్ క్యాంపులు నిర్వహించారు గ్రామంలో జరపీడితుల యొక్క రక్త నమూనాలు తీసుకొని పరీక్ష నిర్వహించడం జరిగిందని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జరం వచ్చిన వెంటనే దగ్గర్లోని ప్రాథమిక వైద్యాన్ని సంప్రదించాలని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డ్రై డే ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతను వివరించారు ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే విధిగా పాటించవలసిందిగా కోరారు *స్వచ్ఛదనం *పచ్చదనo *లో కార్యక్రమంలో భాగంగా అందరు పరిసరాలను పరిశుభ్రంగా కొబ్బరి బోండాలు టైర్లు డబ్బాలు కూలర్లు లో నీరు నిలవకుండా చూసుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తులసీదాస్ సీతంపేట పల్లెదవన డాక్టర్ కళ్యాణ్ సిహెచ్ఓ శ్యామల సూపర్వైజర్లు బాలశౌరి సువార్త హెల్త్ అసిస్టెంట్ అజీజ్ సత్య రజిత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now