*ఖబర్దార్ కౌశిక్ రెడ్డి…!*
*నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు…!*
*10 సంవత్సరాలలో చేయని పని సంవత్సర కాలంలో చేసి చూపెడుతున్నాం*
*మీడియాలో హైలెట్ కోసం నాటకాలు వేస్తే చూస్తూ ఊరుకోం*
*మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరుశురాం రావు*
*జమ్మికుంట జనవరి 24 ప్రశ్న ఆయుధం*
గెలిచిన దగ్గర నుండి ఎంతసేపు మీడియాలో హైలెట్ కావడం కోసం ప్రయత్నం చేయడమే తప్ప మరి పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనే సోయి లేకుండా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని చూస్తే జనాలు సిగ్గుతో తలదించుకుంటున్నారని పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేనిది ఒక్క సంవత్సర కాలంలోనే అన్ని కావాలని ప్రభుత్వం పైన నిత్యం విమర్శలు చేస్తూన్న కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరమనేని పరుశు రామ్ రావు హెచ్చరించారు నీ నాటకాలు ఇలానే కొనసాగినట్లయితే నియోజకవర్గంలో జనాలు ఊరికించి తరిమే రోజులు వస్తాయని, నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. మండలం లోని విలాసాగర్ గ్రామం లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 10ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలును జీర్ణించుకోలేక ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరమనేని పరశురాం రావు యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, సీనియర్ నాయకులు కల్లేపల్లి జంపయ్య, రావుల నందం, గాదె వీరగోపాల్, చింతల శ్రీనివాస్, బొక్కల గోపి, యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ పైడిపల్లి వెంకటేష్, మ్యాక మల్లయ్య, మారేపల్లి ప్రశాంత్ మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు