అత్యవసరంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రాణదాత..
ఆపదలో ఉన్న రోగులకు అండగా ఉండటమే కాకుండా రక్తం తక్కువై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అత్యవసరంగా రక్తం కావాల్సి ఉండటంతో ప్రముఖ ఆర్ఎంపి వైద్యులు కంటె కేశవ గౌడ్ హుటా హుటీనా హాస్పిటల్ కి వచ్చి నిండు ప్రాణాన్ని కాపాడిన సంఘటన సోమవారం దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. మారుతి వెంకట్ (55) అనే రోగి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన దిబ్బగూడెం మట్టా సత్యనారాయణ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు బ్లడ్ తక్కువ కావడంతో అత్యవసరంగా కేశవ్ గౌడ్ కు పిలుపు వచ్చింది. దీంతో అడిగిన వెంటనే హాస్పటల్ కు వచ్చిన ఆధార్ పార్టీ భద్రాచలం కొత్తగూడెం చైర్మన్ కంటే…. కేశవ్ గౌడ్ ….తన బీ పాజిటివ్ బ్లడ్ ను ఆయనకు అందించి ప్రాణాలను కాపాడాడు. అదేవిధంగా కేశవ్ గౌడ్ ఆర్ఎంపీ గా ఉంటూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఉండటంతో ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఇలా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. అడిగిన వెంటనే బ్లడ్ అందించిన ఆయనను మేము సైతం ఫౌండేషన్ సభ్యులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు.