కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేలు ఇవ్వాలి

కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేలు ఇవ్వాలి

కేర్ టేకర్లను నియమించి ఉపాధ్యాయినీలకు రాత్రిపూట విధులకు మినహాయింపు ఇవ్వాలి

సభ్య సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తపస్

జమ్మికుంట ఇల్లందకుంట సెప్టెంబర్ 16 ప్రశ్న ఆయుధం

కేజీబీవీ ఉపాధ్యాయినులకు మినిమం టైమ్ స్కేల్ ఇస్తూ ,కేర్ టేకర్లను నియమించి ఉపాధ్యాయినిలకు రాత్రిపూట విదులనుంచి మినహాయింపునివ్వాలని తపస్ సభ్యత్వ కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి అంబటి వేణుకుమార్ అన్నారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున ఇల్లందకుంట మండలంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకుంటూ సభ్యత్వ నమోదు చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్రకార్యదర్శి అంబటి వేణుకుమార్ మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీ ఉపాధ్యాయినీలకు మినిమం టైమ్ స్కేల్ మంజూరు చేస్తూ, కేర్ టేకర్ ను నియమించి, రాత్రిపూట విధుల నుంచి మినహాయింపు నివ్వాలని, వారికి కూడా ఐచ్చిక సెలవులను అనుమతించాలని,సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధు కింద వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమనేని తిరుపతిరావు , జిల్లా సహాధ్యక్షులు కట్కూరి శ్రీధర్ రెడ్డి, ఇల్లందకుంట మండల శాఖ అధ్యక్షులు దూడం సాంబయ్య, ప్రధాన కార్యదర్శి గట్టు కుమారస్వామి, జమ్మికుంట అధ్యక్షులు బైరి సురేష్, తిరుపతిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment