సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): కల్లు గీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ లో కల్లుగీత కార్మిక సంఘం 68వ వార్షికోత్సవం సందర్భంగా ఆశన్నగౌడ్ కేక్ కట్ చేసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజు గౌడ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జ.జయరాజు, జిల్లా చేతివృత్తి సంఘాల నాయకులు ఎం. నర్సింలు మాట్లాడుతూ.. కల్లుగీత కార్మిక సంఘం 1957లో ప్రారంభమై అనేక పోరాటాల విజయాలు సాధించడం జరిగిందని, నాటి నుండి నేటి వరకు వృత్తి రక్షణ కోసం కార్మికుల ఉపాధి కోసం గౌడ కులస్తుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ వేలం పాటలను రద్దుచేసి, కల్లు సొసైటీలను ఏర్పాటు చేయడం, డీఎస్పీ లైసెన్సులను మంజూరు చేయడం, ఈత తాటి చెట్ల పెంపకానికి 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూమి ఇవ్వడం, పెన్షన్ మంజూరు చేయడం, గీతా కార్మికులు మరణిస్తే ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. ఈత తాటి చెట్లు నరికి వేసిన వారిపై కేసులు పెట్టించడం, కల్లుగీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం, ప్రభుత్వంకు కట్టవలసిన మూడు రకాల పన్నులను రద్దు చేయించడం, సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం, లైసెన్స్ రెన్యువల్ ను 10 సంవత్సరాలకు పెంచడం బీసీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. హైదరాబాదులో నీరా ఏర్పాటు చేయడం అనేక జీవోలను చట్టాలను సాధించిన ఘనత కల్లు గీత కార్మిక సంఘాన్నిదని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, అరులైన కల్లుగీత కార్మికులందరికీ 4వేల పెన్షన్ ఇవ్వాలని, అక్రమ మద్యం బెల్టు షాపులను నిర్మూలించాలని, ప్రతి సొసైటీకి చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజులలో ప్రతి రక్షణ కోసం ఉపాధి కోసం గౌడ సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు అంజాగౌడ్, జిల్లా నాయకులు, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ గౌడ్, రామాగౌడ్, వెంకటేశంగౌడ్, యాదాగౌడ్, భూమాగౌడ్, సతీష్ గౌడ్, చిన్నగౌడ్, మల్లేశంగౌడ్, సత్యనారాయణ గౌడ్, వీరేశం గౌడ్, నవీన్ గౌడ్, రవిగౌడ్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పోరాటాలతోనే కల్లుగీత వృత్తి రక్షణ కేజీకేఎస్ 68వ వార్షికోత్సవ సభ: గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశన్నగౌడ్, రమేష్ గౌడ్
Published On: October 29, 2025 5:33 pm