దమ్మపేట మండలంఆదివాసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఉంచిన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే ఖబడ్దార్

 

 

తీవ్రంగా ఖండిస్తున్న ఆదివాసి సంఘాలు

ఆదివాసీ కమ్యూనిటీ హాల్ అనుమతులు లేకుండ ఆక్రమించుకున్నా (అజీమ్ స్వచ్ఛంద సంస్థ )కి నిరాసన గా రేపు దమ్మపేట మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద మహా ధర్నా కి పిలునిచ్చిన ఆదివాసీ నాయకులు

స్వచ్ఛంద సేవ పట్ల అంతా అభిమతం ఉంటె అనాధ శ వాలు ధహనా సంస్కారాలు,శవ పెటికలను ప్రీజర్ పెట్టెలు ప్రభుత్వం వైకుంఠధామాలు,ఖబరస్థాన్ లు ఏర్పాటు చేసారు.అక్కడ అంత్యక్రియలు చేసుకోవాలి హితవు పలికిన ఆదివాసీ నాయకులు  

మా దేవుల్లు విగ్రహాల ముందు ఇలాంటి చర్యలు చేయడం మా అంతరాత్మను పరీక్షించినట్టే ఉంటుంది..మా ఆదివాసిల ఆత్మగౌరవం దెబ్బతీశెలా తుచ్చపు చర్యలు పూనుకోవడం భాధాకరం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట ఎమ్మార్వో ఆఫీస్ పక్కన ఆదివాసిల ఆరాధ్య దైవాలు మన్యం వీరుడు ,తెలంగాణ సాయుధ పోరాట స్వాతంత్ర్య సమరయోధుడు సోయం గంగులు,గోండు బొబ్బిలి కొమరం. భీం విగ్రహం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మందలపల్లికి చెందిన కొందరు వ్యక్తులు (అజీమ్ అండ్ టీం) సేవా సంస్థ అని చెప్పి ఆక్రమించారు,అట్టి చర్యను తీవ్రంగా ఖండిస్తున్న ఆదివాసీ సంఘాలు, ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతాం అంటున్న ఆదివాసి సంఘాలు,తక్షణమే ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలికి గుడారాన్ని పీకేయాలని,శవాలు కోసం ప్రీజర్ పెట్టెలు ఆదివాసీ కమ్యూనిటీ హాల్ నుండి వెంటనే తరించాలి లేకపోతె రేపు సంఘాల తరఫున ధర్నా చేయాల్సి వస్తుందని ఆదివాసీలు నాయకులు హెచ్చరించారు తెలిపారు.ఆదివాసీ నాయకులు స్వచ్ఛంద సేవలకు,అనాధ శవాలు ధహనా సంస్కారాలకు మేము వ్యతిరేకo కాదు వాటికీ వైకుంఠధామలు,ఖబరస్థాన్ లు ఉన్నయి అని,కానీ మా ఆదివాసీ పోరాట యోధులు ముంధు శవాలను పెట్టి ఆదివాసిల ఆత్మగౌరవం దెబ్బతీశెల కొందరు చర్యలకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆదివాసీ నాయకులు అన్నారు…ఆదివాసీ కమిటీ హాలు ని ఆక్రమించుకోవడానికీ ప్రయత్నం చేస్తున్నా వారు పునారలోచన చెయ్యాలి అన్నారు.ఆదివాసీల సహనం,ఓపికను చేతకాని గా చూస్తే ధాని పర్యవసానాలు మరోలా ఉంటాయీ అని ఆదివాసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు సోయం వీరభద్రం  ఆదివాసీ జేఏసీ నాయకులు తెల్లం.రామారావు,బండారు సూర్యనారాయణ,కాసిని వెంకటేశ్వరరావు,వాసం వెంకటేశ్వరరావు,అప్పిరెడ్డి .వెంకన్న, తంబల్లా రవికుమార్ సోయం. నాగేంద్ర బాబు  పాల్గొన్నారు

Join WhatsApp

Join Now