*ఖబర్దార్ కౌశిక్ రెడ్డి మహిళలను అవమానించిన నీకు తీవ్ర పరిణామాలు*
*మహిళలు భిక్షమేస్తేనే ఎమ్మెల్యే అయ్యావు కౌశిక్ రెడ్డి గుర్తు పెట్టుకో..?
*హుజురాబాద్ కు వస్తే చీర,గాజులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం*
*కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పుష్పలత లావణ్య రేణుక సుశీల*
*జమ్మికుంట /హుజరాబాద్ ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హుజురాబాద్ పట్టణంలో లో దుమారం చెలరేగాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలు చీర,గాజులు తొడుక్కోవాలని కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలాన్ని వాడగా అంతే ధీటుగా కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మహిళల్ని చులకనభావంతో చూస్తూ కించపరుస్తున్నాడని సహించబోమని తన భార్య కొంగు చాపి ఓట్లు అడిగితే హుజురాబాద్ ప్రజలు పెట్టిన బిక్ష అని తన కొంగు చీరలో ఒక భాగం అని గుర్తుంచుకోవాలని చీర చేయబట్టి గెలిచావని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు భారతీయ సంస్కృతికి చీర,గాజులు ప్రతీక అని అలాంటి వాటిని చులకన భావంతో చూస్తే ఊరుకోమని హెచ్చరించారు భార్య,బిడ్డను అడ్డుపెట్టుకొని గెలిచిన కౌశిక్ రెడ్డి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర గవర్నర్ ను కించపరిచి మహిళాకమిషన్ కు క్షమాపణ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదని,మహిళలను అవమానించిన కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి వస్తే చీర,గాజులతో స్వాగతం చెప్పడానికి ఆడబిడ్డలం సిద్ధంగా ఉన్నామని,నీతులు చెప్పే కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి కేసిఆర్ మోచేతి నీళ్లు తాగలేదా అని ప్రశ్నించారు.పాడు మాటలు మాట్లాడే కౌశిక్ రెడ్డి ఇకపై ఇంటి పేరును పాడి కాకుండా పాడు కౌశిక్ రెడ్డిగా మార్చుకోవాలని సూచించారు కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీకి చీర,గాజులు వాయినంగా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ అధ్యక్షురాలు పుష్పలత,మండల అధ్యక్షురాలు లావణ్య,జమ్మికుంట మండల అధ్యక్షురాలు పూదరి రేణుక,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుశీల పుల్ల రాధ బుర్ర రేణుక మల్లీశ్వరి సునీత స్వరూప తిరుమల కరీమ మహిళా నాయకురాలు పాల్గొన్నారు.