“బంజారాల రిజర్వేషన్ల జోలికి వస్తే ఖబర్దార్” – పోచారం శ్రీనివాస్ జాదవ్

బంజారాల రిజర్వేషన్ల జోలికి వస్తే ఖబర్దార్” – పోచారం శ్రీనివాస్ జాదవ్

 

బాన్సువాడ, ఆర్ సి సెప్టెంబర్ 15 (ప్రశ్న ఆయుధం):

 

 

“బంజారాల రిజర్వేషన్ల జోలికి వస్తే ఖబర్దార్” అని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పోచారం గ్రామ యువ నాయకుడు పోచారం శ్రీనివాస్ జాదవ్ ఘాటుగా హెచ్చరించారు.

సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, కొందరు ఆదివాసి నాయకులు బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సరికాదన్నారు. “కుహాన రాజకీయ నాయకులు స్వలాభం కోసం గిరిజనుల మధ్య తగాదాలు పెట్టడం సమాజానికి ప్రమాదకరం” అని స్పష్టం చేశారు.

బంజారా నాయకులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ, “ఐక్యతే మన బలం. బంజారా సమాజం హక్కుల కోసం అందరం ఒకటిగా నిలబడాలి” అని పిలుపునిచ్చారు.

అలాగే, బంజారాల ఐక్యతను ధ్వంసం చేయడానికి ఎవరైనా కుట్రలు చేస్తే వారికి తగిన బుద్ధి చెబుతామని ఘాటుగా హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment