Site icon PRASHNA AYUDHAM

ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన ఖర్గే..

ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన ఖర్గే.. మోదీని గద్దె దించే వరకు చనిపోనని శపథం.

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి.ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. అయితే.. కతువా జిల్లాలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనూహ్య ఘటన జరిగింది. వేదికపై ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగిస్తున్న సమయంలో అదుపు తప్పి పడబోయారు. అప్రమత్తమైన భద్రత సిబ్బంది, నేతలు ఆయన పడిపోకుండా అడ్డుకున్నారు.వెంటనే నీరు తాగించారు. అస్వస్థకు గురైనా ఖర్గే తన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిలబడి ఉండగా.. ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తాం. అందుకోసం పోరాడుతూనే ఉంటాం. ఎనిమిది పదుల వయసులో ఉన్న నేను.. అప్పుడే చనిపోను. మోదీ సర్కార్‌ను గద్దె దించే వరకు అలసిపోను. అప్పటివరకు బతికే ఉంటా’’ అని పేర్కొన్నారు.

Exit mobile version